ఇప్పుడు పండుగల సీజన్ నడుస్తుంది..వరుసగా పండగలను జరుపుకుంటున్నాము..ఈ నెలలో 24 వ తేదీన దీపావళి.. అంతకన్నా ఒక్కరోజు ముందు వచ్చేది ధన్‌తేరాస్..ధనత్రయోదశి లేదా ధన్వంతరి త్రయోదశి అని కూడా పిలువబడే ధన్‌తేరాస్..ఈ సంవత్సరం అక్టోబర్ 23న వచ్చింది ఈ పవిత్రమైన పండుగ.ధన్‌తేరస్ అనే పదం ధన్ మరియు తేరాస్ అనే రెండు పదాల నుండి ఉద్భవించింది. ధన్ అంటే సంపద, తేరాస్ అనేది 13వ రోజు.
ఈ ధన్తేరస్ అనేది కార్తీక మాసంలో కృష్ణ పక్షంలోని పదమూడవ రోజున వస్తుంది. ధన్‌తేరాస్ ఐదు రోజుల దీపావళి పండుగకు ఆరంభంగా జరుపుకుంటారు. ఐదు రోజుల దీపావళి పండుగలో మొదటి రోజు ధన్ తేరస్, రెండవ రోజు నరక చతుర్దశి,మూడవ రోజు దీపావళి,నాల్గవ రోజు గోవర్ధన్ పూజ,ఐదవ రోజు అన్నా చెల్లెల పండగ. 23 అక్టోబర్ 2022న ధన్ తేరస్ వచ్చింది. ధన్ తేరస్ నాడు పూజలు చేయడం వలన సంపద కలుగుతుంది. అలానే సకల రోగాలు పోయి ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం..
సంపదలకు దేవతగా, కుబేరునిగా, లక్ష్మీదేవిగా, ఆరోగ్య దేవతగా భావించే ధన్వంతర ఆరాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ధన్‌తేరాస్‌లో పూజలు చేయడం వల్ల సంపద, ఆహారంతో పాటు మంచి ఆరోగ్యాన్ని పొందుతారని నమ్ముతారు. ఈ రోజున, శివుని అనుగ్రహం కోసం ప్రదోష వ్రతాన్ని కూడా ఆచరిస్తారు.
ధన్వంతరి భగవానుడు ఈ రోజున జన్మించాడని నమ్ముతారు. అందుకే ధన్వంతరి జన్మదినాన్ని కూడా ధన్‌తేరస్‌గా జరుపుకుంటారు. ఈ రోజున ఏదైనా వస్తువును కొనుగోలు చేయడం ఒక సంవత్సరం పాటు ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తుందని చెబుతారు. అందుకే ప్రజలు కానుకలు, బంగారం, పాత్రలు, ఆభరణాలు అమ్మవారికి ఇష్టంగా కొనుగోలు చేస్తారు..
ఇకపోతే ఈ రోజు కొన్నింటిని కొంటె ధనం రెట్టింపు అవుతుందని, మరి కొన్నింటిని కొంటె ధనం పోతుందని ప్రజలు అంటారు.మరి ఈరోజు ఏవి కొనాలి,ఏవి కొనకూడదో ఇప్పుడే తెలుసుకుందాం..
ఈరోజు కొనాల్సిన వస్తువులు ఇవే..
*. బంగారం, వెండి, ఇత్తడి, రాగి వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు.
*. ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయండి. వాటిని మీ ఇంట్లో ఈశాన్య దిశలో ఉంచండి.
*. ధన్‌తేరస్‌లో ఇత్తడితో చేసిన వెండి వస్తువులు లేదా పాత్రలను కొనుగోలు చేయండి.
*. మీరు బంగారు నాణేలను కొనుగోలు చేయలేకపోతే, వెండి నాణేలు కూడా ప్రయోజనాన్ని అందిస్తాయి.
*. అలాగే ఇంటికి చీపురు కొనడం మంచిది.మీ ఇంటి నుండి అన్ని కష్టాలను తుడిచిపెట్టడాన్ని సూచిస్తుంది.
*.ఇంటిలోకి ఫర్నిచర్ ను కొనడం మంచిది.
ఈరోజు అస్సలు కొనకూడినవి ఇవే..
*.నలుపు రంగులో ఉన్న వస్తువులను కొనుగోలు చేయవద్దు. ధన్‌తేరాస్ పవిత్రమైన రోజు. నలుపు దురదృష్టాన్ని సూచిస్తుంది.. కాబట్టి, దీనికి దూరంగా ఉండాలి.
*. గాజుతో చేసిన ఏ వస్తువునూ కొనకండి.
కారు కొనకండి.
*. రాహువుతో ముడిపడి ఉన్నందున అల్యూమినియం పాత్రలను కొనడం మానుకోండి.
*.కత్తెర, కత్తులు, పిన్స్ వంటి పదునైన వస్తువులను కొనడం మంచిది కాదు..