ఫుడ్ సేఫ్టీపై ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలవాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ పై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులకు దిశానిర్దేశం చేశారు దామోదర్ రాజనర్సింహ.నిబంధనలు, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యంతో ఫుడ్ వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ,రాష్ట్ర వ్యాప్తంగా ఆహార తనిఖీ బృందాలు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఫుడ్ లాబ్స్ ద్వారా సుమారు 180 నుంచి 200 ఫుడ్ శాంపిల్స్ లను టెస్టులు చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ప్రభుత్వ హాస్టల్స్, ప్రైవేటు బోర్డింగ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లు, బేకరీలు, డెయిరీ ఫుడ్ తయారీదారులు, రెస్టారెంట్లు, ప్యాకేజ్డ్ ఫుడ్ తయారుదారులు లైసెన్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిని ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు .ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ – 2006 ప్రకారం నాణ్యత ప్రమాణాలు పాటించని ఫుడ్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి దామోదర్ రాజనర్సింహ హెచ్చరించారు.