బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ… మాజీ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. బీజేపీలో బీఆర్‌ఎస్‌ను కలిపేందుకు కేటీఆర్, సంతోష్ రావులు ఢిల్లీ వేదికగా చర్చలు జరుపుతున్నారని అన్నారు.యాదాద్రి, చత్తీస్‌గఢ్ కరెంట్ విషయంలో అవకతవకలు జరిగాయి అని ఆరోపించారు. విద్యుత్ అంశంలో 15 వేల కోట్ల అవినీతి జరిగింది అని మండిపడ్డారు. నిజాయితీ గల వ్యక్తితో కమిషన్ వేస్తే కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు. కమిషన్‌పై నమ్మకం లేదని కేసీఆర్ అనడం దుర్మార్గమని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
మీరు ఎన్ని అవకతవకలు చేసినా వదిలేయాలా? అని ప్రశ్నించారు. గొర్రెల పంపిణీలో జరిగిన వందల కోట్లు అవినీతిపై ఈడీ విచారణ జరుగుతోందన్నారు.ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించి డబ్బులు గుంజారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గత పది సంవత్సరాలలో లక్షల కోట్లు సంపాదించారు. బీఆర్ఎస్ అనేది లేకుండా పోయింది అని అన్నారు.