పాలని ఇష్టపడని వాళ్ళు పాలకి బదులు ఇవి తీసుకుంటే మంచిది..!

-

కొందరికి పాలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. పాలు అంటే చాలు ఆమడ దూరం పారిపోతారు. అటువంటి వాళ్ళు పాలకి బదులుగా ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే కాల్షియం అందుతుందని డాక్టర్లు అంటున్నారు. క్యాల్షియం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. క్యాల్షియం ఉంటే ఎముకలు దృఢంగా ఉంటాయి. అయితే పాల ద్వారా కాల్షియం తీసుకోలేకపోతే ఇతర ఆహార పదార్థాల ద్వారా కాల్షియం పొందొచ్చు. మరి వాటి కోసం మనం ఇప్పుడు చూద్దాం.

బీన్స్:

బీన్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. బీన్స్ లో కేవలం క్యాల్షియం మాత్రమే కాదు ప్రోటీన్ కూడా సమృద్ధిగా ఉంటాయి. మీరు బీన్స్ ని సలాడ్స్ వంటి వాటిలో వేసుకుని కూడా తీసుకోవచ్చు.

అరటి పండ్లు:

అరటి పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. తక్షణ శక్తిని ఇస్తాయి. అరటి పండులో ఒక మిల్లీ గ్రాము కాల్షియం మనకి లభిస్తుంది. కాబట్టి పాలు నచ్చని వాళ్ళు అరటి పండ్లు కూడా పాలకు బదులుగా తినొచ్చు.

కమలా పండ్లు:

కమల పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అదేవిధంగా ఇతర పండ్లతో పోల్చుకుంటే క్యాల్షియం ఇందులో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పాలు నచ్చని వాళ్ళు కమలా పండ్లను కూడా తినొచ్చు.

కాటేజ్ ఛీజ్:

పాలు తాగిన వాళ్ళు దీనిని కూడా తీసుకోవచ్చు పన్నీర్ లో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. పైగా పన్నీర్ తో వివిధ రకాల రెసిపీస్ చేసుకుని తినొచ్చు.

తెల్ల నువ్వులు:

తెల్ల నువ్వులలో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీనితో లడ్డూలు వంటివి తయారు చేసుకుని పాలకు బదులుగా తీసుకోవచ్చు. తద్వారా క్యాల్షియం అందుతుంది. అనారోగ్య సమస్యల నుండి కూడా దూరంగా ఉండచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version