ఈ తప్పులు అస్సలు చెయ్యకండి.. అడ్డంగా బుక్కవ్వడం ఖాయం..

-

కొన్ని సార్లు మనం చేస్తున్న తప్పులు మన మెడకు బిగుసుకుంటుంది.. ముఖ్యంగా ఫోన్ల విషయంలో.. అవసరానికి వాడితే మంచిదే కానీ,వేరే విధంగా వాడితే జైలుకు వెళ్లడం ఖాయం. సిమ్ కార్డులను వాడటం గురించి తప్పక తెలుసుకోవాలి. రెండు కంటే ఎక్కువ సిమ్ కార్డులు వాడుతున్నారా. అయితే ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. ఇవి మర్చిపోతే మీ సిమ్ కార్డే మిమ్మల్ని జైలుకు పంపిస్తుంది.. అవునండి మీరు విన్నది నిజమే..

సిమ్‌ కార్డును ఇతరుల చేతుల్లోకి పడనివ్వకుండా జాగ్రత్త పడాలి.. ఒకవేళ అదే జరిగితే సిమ్ కార్డు దిర్వినియోగం కావడం పక్కా. వాళ్లు ఆ సిమ్ కార్డు ద్వారా మోసాలకు కూడా పాల్పడవచ్చు. మీ మొబైల్ నెంబర్‌ తో ఏదైనా మోసం జరిగితే.. మీరు జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఇదిలా ఉంటే.. మరికొందరు తమ ఫోన్‌లో సిమ్ కార్డు పని చేయట్లేదని.. వేరొకరి మొబైల్‌లో పెడుతుంటారు. తద్వారా ఆ వ్యక్తులు మీ సిమ్‌కు డూప్లికేట్ లేదా క్లోన్‌ తయారు చేసి దానితో తప్పుడు పనులకు వినియోగించవచ్చు. అలాగే మీ దగ్గర ఒకటి కంటే ఎక్కువ సిమ్‌లు ఉన్నప్పుడు.. వాటితో నిర్లక్ష్యంగా వ్యవహరించకండి. అవి వేరొకరి చేతుల్లో పడితే కచ్చితంగా క్రిమినల్ యాక్టివిటీస్‌కు ఉపయోగిస్తారు..

మీకు జైలు శిక్ష పడవచ్చు. కాగా, మీ సిమ్ కార్డు మిస్సయి.. తప్పుడు వ్యక్తికి దొరికితే.. అతడు దాని ద్వారా వేరొకరికి బెదిరింపు సందేశాలు లేదా కాల్‌లు చేయవచ్చు.అందుకే మీ సిమ్ పోయిన వెంటనే ఫిర్యాదు చెయ్యడం లేదా బ్లాక్ చేయించు కోవాలి.. అప్పుడే మీరు సేఫ్.. ఇవి తప్పక గుర్తుంచుకోండి.. లేదంటే రిస్క్ లో పడతారు... బీ కేర్ ఫుల్..

Read more RELATED
Recommended to you

Latest news