సాధారణంగా మనకు రోజంతా అప్సేట్‌గా ఉన్నా… ఏదైనా అనుకోని ప్రమాదం పొంచుకువచ్చినా… పొద్దున లేవగానే ఎవరి మొహం చూశామో! అని అనుకుంటాం. మన చుట్టూ ఉండే వాతావరణంలో పాజిటివ్ ఎనర్జీతో పాటు నెగెటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. దీన్ని నమ్మేవారు ఉన్నారు! నమ్మని వారు కూడా ఉన్నారు! కానీ, ఎకాలజీ ప్రకారం.. మన చుట్టూ ఉండే వస్తువులు కూడా మన జీవితంపై ప్రభావం చూపుతాయి. అందుకే కొన్ని వస్తువులను ఉదయమే చూడకూడదు. ఆ వివరాలు తెలుసుకుందాం.
- ఉదయం నిద్రలేచిన వెంటనే పగిలిన గడియారాన్ని చూడకూడదు. ఇంట్లో ఒకవేళ అలాంటి గడియారం ఉంటే వెంటనే తీసేయండి.
- నిద్ర లేచిన వెంటనే అద్దం చూసుకోవడం మనలో చాలా మందికి అలవాటు. కానీ అలా చేయకూడదట. ఆ సమయంలో నెగెటివ్ ఎనర్జీ అద్దంలో ప్రతిబింబిస్తుందట. ఒకవేళ మీరు అద్దంలో చూసుకుంటే ఆ ప్రభావం పడి రోజంతా బాగుండదట.
- బెడ్ మీది నుంచి నేరుగా కిచెన్‌లోకి వెళ్లి స్టవ్ వెలిగించకూడదు. ఎకాలజీ ప్రకారం.. ఉదయం స్టవ్‌పై మంటను చేస్తే దురదృష్టం కలుగుతుందట. అందుకే నిద్రలేచిన 10–15 నిమిషాల తర్వాతే కిచెన్‌లోకి వెళ్లాలి.
- అలాగే ఇతరుల నీడను చూడకూడదు. ఆ వ్యక్తికి ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఉంటే అవి మనకూ వస్తాయట.
- ఇవే కాదు.. ఇంట్లో ఇతర పగిలిపోయిన పాత్రలు, ఫర్నిచర్‌లో నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది. వాటిని నిద్ర లేవగానే చూడాల్సి వస్తుంది.
- కత్తులు, కత్తెరలను, కర్రలను కూడా ఉదయాన్నే చూడకూదు. అందులో నెగెటివ్ ఎనర్జీ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
- కిచెన్‌లో అపరిశుభ్రమైన పాత్రలను చూడకూడదు. మనలో చాలా మంది రాత్రి భోజనం చేసిన తర్వాత ఆ పాత్రలను సింక్‌లో అలాగే వదిలేస్తారు. ఉదయం నిద్రలేచిన తర్వాత వాటిని తోముతారు. కానీ ఉదయాన్నే అలాంటి పాత్రలను చూస్తే దురదష్టం వెంటాడుతుందట.
- అలాగే.. మరుగుతున్న నీటి నుంచి వచ్చే ఆవిరిని చూడకూడదు. అందులో నెగెటివ్ ఎనర్జీ ఉంటుందట. పాత్రల నుంచి వచ్చే నీటి ఆవిరిని చూస్తే ఆ రోజు ఏ పనులూ జరగవట.
- మడిపోయిన నల్లని మరకలు పడి, కొన్ని మసిబారిపోయి నల్లగా అవుతాయి. ఆ వస్తువులను ఉదయాన్నే చూడడం మంచిది కాదు.
- గుమ్మడి కాయ తింటే ఆరోగ్యానికి మంచింది. గుమ్మడి కాయలో నెగెటివ్ ఎనర్జీ ఉంటుందట. అందుకే ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే వీటిని చూడకూడదు.