కరోనా వ్యాప్తి భారీగా పెరుగుతున్న నేపథ్యంలో భారత దేశంలో ఎక్కువ మంది వస్త్రం అంటే క్లాత్ తో చేసిన మాస్కులు వాడుతున్న సంగతి తెలిసిందే. అయితే వస్త్రముతో చేసిన మాస్కులు అంత శ్రేయస్కరం కాదని నిపుణులు చెబుతున్నారు. దాని కంటే ఎన్ 95, లేదా KN 95 మాస్కులు వాడమని సలహా ఇస్తున్నారు.
వస్త్రముతో చేసిన మాస్కులు కంటే ఎన్ 95, లేదా KN 95 మాస్కులు శ్రేయస్కరమని అమెరికాలో మేరీలాండ్ ప్రొఫెసర్ ఫహీమ్ యూనస్ చెబుతున్నారు. అంతేగాక ఆ మాస్కులు వాడిన వెంటనే పేపర్ లో దాచి మరుసటి రోజుకు మళ్ళీ వాడుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ మాస్కులు పాడైపోకుండా ఉంటే కొన్ని వారాల పాటు వాడుకోవచ్చు అని ఆయన పేర్కొన్నారు. వీలైనంతగా వస్త్రముతో చేసిన మాస్కులు ధరించి వద్దని ఆయన చెబుతున్నారు.