Independence Day: ప్లాస్టిక్ పతాకం వాడొద్దంటున్న కేంద్రం.. జాతీయ పతాకాల వాడాకంపై రాష్ట్రాలకు మార్గదర్శకాలు

-

స్వాతంత్ర దినోత్సవానికి మరికొన్ని రోజులే ఉన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం పతాకం వాడకం విషయంలో కొన్ని మార్గదర్శకాలను రాష్ట్రాలకు సూచించింది. మువ్వన్నెల మూడు రంగుల జెండాను ప్లాస్టిక్ తో తయారు చేయవద్దని, ప్లాస్టిక్ తో తయారు చేసిన జెండాను వాడవద్దని గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణానికి ఇబ్బంది కలిగించకుండా తద్వారా మానవాళి భవిష్యత్తుకు భరోసా కలిగించేందుకు ప్లాస్టిక్ పై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని, ఆ కారణంగా భూమిలో కలిసిపోని ప్లాస్టిక్ పదార్థంతో జెండాను తయారు చేయవద్దని కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలను కోరింది.

ఇంకా, ఆటలు, సాంప్రదాయం మొదలగు సందర్భాల్లో దేశ గౌరవాన్ని ప్రపంచానికి ఇనుమడింప చేసే సమయాల్లోనూ ప్లాస్టిక్ తో తయారైన జాతీయ జెండాను వాడవద్దని తెలిపింది. భూమిలో కలిసిపోయే పేపర్ తో తయారైన జాతీయ జెండాను వినియోగించాలని పేర్కొంది. అదీగాక దేశానికి చిహ్నమైన జాతీయ జెండాను అవమానించేలా రోడ్లపై, బహిరంగ ప్రదేశాలలో జెండా పతాకాలను పారవేయరాదని, వ్యక్తిగత సమయంలో మాత్రమే దాన్ని డిస్మిస్ చేయాలని, ఈ మేరకు భారత జాతీయ జెండా చట్టం 2002ప్రకారం నడుచుకోవాలని తెలిపింది.

ప్లాస్టిక్ కారణంగా భూ కాలుష్యం మరింత పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, భావి తరాల భవిష్యత్తును కాపాడాలని జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news