చదివింది మీకు గుర్తు ఉండట్లేదా..? అయితే ఇలా చేయండి..!

-

చాలామంది చదివినది మర్చిపోతూ ఉంటారు చదివినది గుర్తు పెట్టుకోవడం వల్ల చాలా కష్టంగా ఉంటుంది. చదివింది గుర్తు ఉండాలంటే ఇలా చేయండి విద్యార్థులే కాదు ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి. లేదంటే అనవసరంగా మార్కుల్ని కోల్పోవాలి. చదివింది బాగా గుర్తుండాలంటే చదువు మీద శ్రద్ధతో పాటుగా ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే చదివింది బాగా గుర్తుంటుంది.

 

ఎరుపు ద్రాక్ష పండ్లని తీసుకుంటే జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది ఈ పండ్లను కానీ లేదంటే ఈ పండ్లని జ్యూస్ చేసుకుని గాని తీసుకోండి మెదడుని చురుగ్గా మారుస్తుంది ఎర్ర ద్రాక్ష బెర్రీస్ ని తీసుకుంటే కూడా జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. చదివింది గుర్తుండాలంటే బెర్రీస్ ని తీసుకోండి. బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, స్ట్రాబెరీ వంటి పండ్లు తీసుకుంటే జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది మెదడు ఆరోగ్యానికి ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ బాగా సహాయ పడతాయి.

అందుకని మీరు సాల్మన్ మొదలైన ఫ్యాటీ ఫిషెస్ ని తీసుకోండి దాంతో జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. గింజలను తీసుకుంటే కూడా మీరు మీ జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు బాదం పిస్తా ఎండుద్రాక్ష వాల్నట్స్ మొదలైన గింజల్ని పిల్లలకి ప్రతిరోజు పెట్టండి. ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ తో పాటుగా సెలీనియం రాగి మ్యాంగనీస్ వంటి పోషకాలు కూడా ఉంటాయి కాబట్టి ఏకాగ్రతని ఇంకొంచెం మెరుగుపరచుకోవచ్చు. బ్రౌన్ రైస్ ని తీసుకుంటే కూడా బరువు కంట్రోల్లో ఉంటుంది అలానే మెదడు బాగా పనిచేస్తుంది. మెదడుకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది కాబట్టి దీనిని కూడా తీసుకుంటూ ఉండండి. కోడిగుడ్లు తీసుకుంటే కూడా చదివింది బాగా గుర్తుంటుంది ఇలా ఈ ఆహార పదార్థాలతో మీరు చదివింది బాగా గుర్తు పెట్టుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news