DOOTHA : భ‌య‌పెట్టేందుకు ఓటీటీలో వ‌స్తున్న అక్కినేని హీరో

-

అక్కినేని యువ హీరో నాగ చైత‌న్య‌.. ఈ మ‌ధ్య కాలంలో స్పీడ్ పెంచేసాడు. వ‌రుస‌గా విభిన్న క‌థ‌ల‌తో సినిమాలు చేస్తు జోరు మీద ఉన్నాడు. ఇటీవ‌ల వ‌చ్చిన ల‌వ్ స్టోరీ సినిమా ఇండ‌స్ట్రీ హిట్ కొట్టిన త‌ర్వాత‌.. విభిన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటూ.. దూసుకెళ్తున్నాడు. టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా.. సినిమాలు చేస్తున్నాడు. ఇప్ప‌టికే బాలీవుడ్ లో అమీర్ ఖాన్ హీరోగా వ‌స్తున్న లాల్ సిండ్ చ‌ద్ధా అనే సినిమాలో న‌టిస్త‌న్నాడు.

అలాగే టాలీవుడ్ లో థ్యాంక్ యు అనే విభిన్న క‌థ చిత్రంలో న‌టించాడు. ఈ రెండు సినిమాలు కూడా త్వ‌ర‌లో విడుద‌ల కానున్నాయి. కాగ ఇప్ప‌టి వ‌ర‌కు థీయేట‌ర్ సినిమాలపైనే ఫోక‌స్ పెట్టిన నాగ చైత‌న్య.. ఇప్పుడు ఓటీటీ ల వైపు చూస్తున్నాడు. ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అయిన అమెజాన్ ఫ్రైమ్ నిర్మిస్తున్న ఒక వెబ్ సిరీస్ లో నాగ చైత‌న్య న‌టిస్తున్నాడ‌నే వార్త‌లు అప్ప‌ట్లో వ‌చ్చాయి. తాజా గా ఆ వెబ్ సిరీస్ షూటింగ్ మంగ‌ళ వారం ప్రారంభం అయింది.

దీనికి దూత అనే టైటిల్ ను కూడా ఖ‌రారు చేశారు. ఈ సంద‌ర్భంగా నాగ చైత‌న్య‌.. త‌న ఇన్ స్టాగ్రామ్ లో దూత షూటింగ్ స్పాట్ లోని ఒక ఫోటోను కూడా అభిమానుల‌తో పంచుకున్నాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news