తెలంగాణ రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్. రేషన్ కార్డు దారుల విషయంపై కీలక నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్. ఇక నుంచి బయోమెట్రిక్ విధానంలోనే రేషన్ కార్డు బియ్యం పంపిణీ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
కరోనా మహమ్మారి ఉన్న వేల రెండేళ్ల కిందట బయో మెట్రిక్ విధానాన్ని నిలుపుదల చేసి.. ఓటీపీ ఆధారంగా రేషన్ కార్డు బియ్యాన్ని పంపినీ చేసేందుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ కూడా పూర్తిగా తగ్గి పోయింది.
ఈ నేపథ్యంలోనే.. ఇక నుంచి బయోమెట్రిక్ విధానంలోనే రేషన్ కార్డు బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఓటీపీ విధానంలో రేషన్ బియ్యం దుర్వినియోగం అవుతున్నాయని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తీర్మానం కూడా చేయడంతో.. బయోమెట్రిక్ విధానాన్ని మళ్లీ ఆచరణలో పెట్టాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.