డబుల్ సెంచరి చేసిన కరోనా కేసులు…!

-

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుంది. ఊహించని స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు 206 నమోదు అయ్యాయి. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కరోనా అత్యంత వేగంగా విస్తరించడం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం. ఏ స్థాయిలో కట్టడి చేస్తున్నా సరే ఈ వైరస్ మాత్రం విస్తరిస్తూనే ఉంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అర్మీని రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తుంది. వ్యాధి సోకినా వారిని ఇతర ప్రాంతాలకు తరలించి చికిత్స అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తెలంగాణాలో కూడా కరోనా వైరస్ వ్యాప్తి అనేది వేగంగా ఉంది. ఇప్పటి వరకు కరోనా కేసులు 17 కి చేరుకున్నాయి. దేశంలో కరోనా కారణంగా అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రత్యేక ల్యాబ్స్ ఏర్పాటు చేసారు.

కరోనా వైరస్ దెబ్బకు ఇప్పటికే స్కూల్స్ కాలేజీలు సెలవలు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక, మహారాష్ట్ర సహా అనేక రాష్ట్రాల్లో కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. అధికార యంత్రాంగం ఎక్కడిక్కడ అప్రమత్తంగా వ్యవహరిస్తూ వస్తుంది. అయినా సరే విదేశాల నుంచి వచ్చిన తర్వాత కరోనా వైరస్ క్రమంగా విస్తరించడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news