తెలంగాణలో అధికారం దక్కించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ నానా తంటాలు పడుతుందనే చెప్పాలి. వరుసగా రెండు సార్లు అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ..ఈ సారైనా అధికారం దక్కించుకోవాలని చూస్తుంది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ అధికారం దక్కించుకునే పరిస్తితి కనిపిస్తుందా? అంటే ఇప్పుడున్న పరిస్తితుల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కడం అంత సులువు కాదనే చెప్పాలి..ఓ వైపు అధికార టీఆర్ఎస్ బలంగా ఉంది…మరోవైపు బీజేపీ బలపడుతుంది..ఈ రెండిటిని నిలువరించి అధికారం దక్కించుకోవడం కాంగ్రెస్ అంత ఈజీ కాదు..పైగా నేతల మధ్య లుకలుకలు పార్టీకి బాగా నష్టం చేకూరుస్తున్నాయి.
ఈ లుకలుకలు వల్లే కంచుకోటల్లో సైతం కాంగ్రెస్ పార్టీ వీక్ అవుతూ వస్తుంది…నేతల మధ్య ఆధిపత్య పోరు కూడా పెద్ద తలనొప్పిగా మారింది. ఈ ఆధిపత్య పోరు ప్రతిచోటా కనిపిస్తుంది. ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి అతి పెద్ద కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో..నేతల మధ్య సమన్వయం అసలు లేదు. ఎవరికి వారు గ్రూపులు నడుపుతూ…పార్టీని ఇంకా వీక్ చేస్తున్నారు. ఇప్పటికీ ప్రతి నియోజకవర్గంలో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.
ముఖ్యంగా సీటు విషయంలో నేతల మధ్య వార్ గట్టిగానే జరుగుతుంది..ఒక సీటు కోసం ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడుతూ…ఎవరికి వారు సెపరేట్ గ్రూపులు నడుపుతూ…పార్టీకి ఇంకా డ్యామేజ్ చేస్తున్నారు. ఉదాహరణకు సూర్యాపేట నియోజకవర్గంలో సీనియర్ నేత దామోదర్ రెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డిల మధ్య వార్ నడుస్తోంది. రమేశ్ రెడ్డి…రేవంత్ వర్గం మనిషి. దీంతో సూర్యాపేట సీటు ఎవరికి దక్కుతుందో క్లారిటీ లేకుండా ఉంది.
అటు తుంగతుర్తిలో అద్దంకి దయాకర్, వడ్డేపల్లి రవిల మధ్య పోరు ఉంది. అద్దంకి..రేవంత్ వర్గం కాగా, రవి..దామోదర్ రెడ్డి మనిషి. ఇక దేవరకొండ సీటు కోసం కిషన్ నాయక్, బాలు నాయక్ ల మధ్య పోటీ ఉంది. మిర్యాలగూడ సీటు విషయంలో బత్తుల లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు మధ్య పోటీ ఉంది. ఇలా పలు సీట్లలో డబుల్ గేమ్ నడుస్తోంది..త్వరగా ఈ డబుల్ గేమ్ కు చెక్ పెట్టకపోతే కంచుకోటలో సైతం కాంగ్రెస్ దెబ్బతినాల్సి వస్తుంది.