కొన్ని కొన్ని సార్లు అనుకోని సంఘటన చోటు చేసుకోవడంతో ఏం చేయాలో తెలియదు. బాత్‌రూంలో పనికానిచేందుకు కూర్చున్న ఓ వ్యక్తిని పాము కరిచింది. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన ఆ వ్యక్తి పరిస్థితి వర్ణానాతీతం. ఈ షాకింగ్ సంఘటన మలేషియాలో జరిగింది. సెలయంట్‌కు చెందిన 28 ఏళ్ల సబ్రి తజలికి టాయిలెట్‌లో వీడియో గేమ్ ఆడే అలవాటు ఉంది. ఒక రోజు అలాగే టాయిలెట్ సీటుపై కూర్చొని వీడియో గేమ్ ఆడటంలో నిమగ్నమయ్యాడు. అయితే ఆ టాయిలెట్ బేసిన్‌లో ఉన్న పాము అతడి పిర్రను గట్టిగా కరిచి పట్టుకుంది. దీంతో పైకి లేచిన అతడు దానిని లాగి పడేసి భయంతో అక్కడి నుంచి ఇంట్లోకి పరుగుతీశాడు. వెంటనే ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు పరిశీలించారు. అది విషపూరిత పాము కాదని చెప్పారు. అయినప్పటికీ యాంటీ టెటానస్ ఇంజెక్షన్ ఇచ్చి చికిత్స చేశారు వైద్యులు.
మరోవైపు ఈ విషయం తెలిసిన పాము సంరక్షకులు ఆ ఇంటి బాత్ రూమ్‌లో దాగిన పామును సరక్షితంగా పట్టుకున్నారు. అయితే తనకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని సబ్రి తన ట్విట్టర్‌లో పంచుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేశాడు. తలుచుకుంటే ఇప్పటికీ భయమేస్తుందని తెలిపాడు. ఈ ఘటన తర్వాత రెండు వారాల వరకు తన టాయిలెట్ రూమ్‌కు వెళ్లలేదని చెప్పాడు. తనను కరచిన పాము విష పూరితం కాకపోవడంతో తాను ప్రాణాలతో బతికి ఉన్నానని అన్నాడు. పాము పంటి గాట్లు రెండు వారాల వరకు పిర్రపై ఉందని, అది అంత గట్టిగా కరిచిందని పేర్కొన్నాడు సబ్రి.
Dua bulan lepas bontot aku kena gigit dengan ular time aku berak. Ular tu keluar dari lubang jamban. Nasib dia tak gigit telur aku. pic.twitter.com/ABDjDkSe2Q
— Sabri Bey (@sabritazali) May 22, 2022