ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. తాజాగా ఇద్దరు ఏపీ మంత్రివర్గంలోని సభ్యులు రాజ్యసభకు నామినేట్ కావడంతో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో ఇద్దరూ బీసీలకు ఇద్దరు బీసీలను నియమించాలని పార్టీ నియమావళి! చాలా కాలంగా వీరి స్థానంలో శ్రీకాకుళం జిల్లానుంచి ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంను మంత్రవర్గంలోకి తీసుకొనే అవకాశం ఉందని తీవ్రంగా ప్రచారం సాగింది. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ.. వైఎస్ జగన్ కేబినేట్ లో పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజుకు స్థానం దక్కింది. దీంతో పార్టీ ఒక్కసారికగా షాక్ కి గురైంది!!
వైఎస్ జగన్ కేబినెట్ విస్తరణ వార్తలు వచ్చినప్పట్టి నుంచి అనేకమంది పేర్లు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నుంచి నిన్నమొన్నటి దాకా అనేకమంది పేర్లు వినిపించాయి. ధర్మాన ప్రసాదరావు, స్పీకర్ తమ్మినేని సీతారాం వంటి సీనియర్ మోస్ట్ నేతలతో పాటు మరికొన్ని పేర్లు ప్రచారంలో ఉండగా.. ఉన్నట్టుండి సడన్ గా తెరపైకి తన పేరు రావడం నిజంగా ఊహించని ఆనందం అంటూ వెల్లడించారు పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు. లక్కీ ఛాన్స్ కొట్టేసిన డాక్టర్ అప్పలరాజు… వైఎస్ జగన్ కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కించుకున్నారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ… తనకు మంత్రి పదవి వస్తుందని ఊహించలేదని.. ఇది ఊహించని ఆనందం అంటూ తెలిపారు. తనపై నమ్మకం ఉంచి.. మంత్రి పదవి ఇచ్చినందుకు సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఇప్పుడు తన బాధ్యత మరింత పెరిగిందని.. పార్టీ అభివృద్ధితో పాటు, ప్రభుత్వ పథకాల అమలుకోసం మరింత ఎక్కువగా కష్టపడతానని స్పష్టం చేశారు. కాగా వైఎస్ జగన్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానని.. ఇంకా తనకు శాఖపై ఎలాంటి ఆలోచన లేదని అప్పలరాజు వివరించారు.