ఉస్మానియా ఆస్పత్రి విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

గత కొద్ది రోజుల క్రితం ఉస్మానియా ఆసుపత్రిలో వరదలు రావడం సంచలనంగా మారింది. రోగులు వార్డులో ఉండగానే వరద నీరు లోపలి రావడంతో ఆ వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఉస్మానియా ఆస్పత్రి వరదల పరిస్థితి మీద కొన్ని పిటిషన్ లు కోర్టులో వేశారు. ఈ క్రమంలోమె ఉస్మానియా ఆస్పత్రిలో వరద నీరు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదన్న పిల్ పై ఈరోజు తెలంగాణా హైకోర్టులో విచారణ జరిగింది. డెక్కన్ ఆర్కియాలాజికల్, కల్చరల్ రీసెర్చ్ సొసైటీ పిల్ పై ఈ విచారణ జరిగింది.

వర్షం నీరు బయటకు వెళ్లే ఏర్పాట్లు సరిగా లేక ఆస్పత్రిలో నీరు నిండుతొందని పిటిషనర్ పేర్కొన్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో వరద నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉస్మానియా ఆస్పత్రిలో వర్షం నీరు మూసీలో కలిసేలా ఏర్పాట్లు చేయాలని హైకోర్టు ఆదేశించింది. గతంలో భారీ వర్షాలు కురిసినప్పుడు రోగులు ఇబ్బంది పడ్డారని ప్రస్తావించిన హైకోర్టు మరో వారం, పది రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. ఇక తదుపరి విచారణ నవంబరు 12కి వాయిదా వేసింది హైకోర్టు.