లోకేష్ గ్యో బ్యాక్ అంటూ గ్రామస్థుల నిరసన..ఉద్రిక్తత…!

తూర్పుగోదావరి జిల్లాలోని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యాటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెదపూడి మండలం అచ్చుతాపురం త్రయం గ్రామం వద్ద.. లోకేష్ గ్యో బ్యాక్ అంటూ గ్రామస్థులు ప్లకార్డులు ప్రదర్శించారు. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనపర్తి నియోజకవర్గంలో లోకేష్ పర్యాటన జరుగకుండా అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. అనంతరం టిడిపి నేతలు పర్యటన ముగించుకొని వెళ్ళిపోయారు.