ఐపీఎల్ స్పాన్స‌ర్ డ్రీమ్ 11లోనూ చైనా కంపెనీ పెట్టుబ‌డులు..? ఇప్పుడేం చేస్తారు..?

-

సెప్టెంబ‌ర్ 19 నుంచి దుబాయ్‌లో జ‌ర‌గ‌నున్న ఐపీఎల్ 13వ ఎడిష‌న్ కోసం రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఫ్రాంచైజీలు ఆగ‌స్టు 20 త‌రువాత దుబాయ్‌కి వెళ్లే యోచ‌న‌లో ఉన్నాయి. ఇంకా టోర్నీ షెడ్యూల్‌ను ప్ర‌క‌టించ‌డ‌మే పెండింగ్‌లో ఉంది. ఇక ఇప్ప‌టికే టోర్నీ టైటిల్ స్పాన్స‌ర్‌షిప్ హ‌క్కుల‌ను ఫాంట‌సీ లీగ్ యాప్ డ్రీమ్ 11 సాధించింది. అయితే ఇప్ప‌డు డ్రీమ్ 11పై కూడా అభిమానులు మండిప‌డుతున్నారు.

dream 11 may have links with chinese companies what now for bcci

ఐపీఎల్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు టైటిల్ స్పాన్స‌ర్‌గా ఉన్న వివో చైనా కంపెనీ కావ‌డంతో ఆ కంపెనీకి ఐపీఎల్ టైటిల్ స్పాన్స‌ర్‌షిప్ హ‌క్కుల‌ను ఇవ్వ‌కూడ‌ద‌ని అభిమానులు బీసీసీఐని డిమాండ్ చేశారు. అయినా స‌రే బీసీసీఐ స‌సేమిరా అంది. పైగా ఆ కంపెనీ వ‌ల్ల మ‌న దేశానికే లాభం వ‌స్తుంది కానీ.. చైనాకు వెళ్ల‌దు క‌దా.. క‌నుక ఆ విష‌యాన్ని ప‌ట్టించుకోవ‌ల‌సిన అవ‌స‌రం లేద‌ని తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు కొత్త‌గా ఐపీఎల్ టైటిల్ స్పాన్స‌ర్ అయిన డ్రీమ్ 11కు కూడా చైనాతో సంబంధాలు ఉన్న‌ట్లు తెలిసింది.

చైనాకు చెందిన టెన్సెంట్ కంపెనీ డ్రీమ్ 11లో 10 శాతం పెట్టుబ‌డులు పెట్టినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అందువ‌ల్ల డ్రీమ్ 11ను కూడా ఐపీఎల్ టైటిల్ స్పాన్స‌ర్‌గా త‌ప్పుకోవాల‌నే డిమాండ్లు వినిపిస్తున్నాయి. పూర్తిగా 100 శాతం స్వదేశీ కంపెనీకే ఆ హ‌క్కులు ఇవ్వాల‌ని అంటున్నారు. అయితే దీనిపై అటు డ్రీమ్ 11, ఇటు బీసీసీఐ స్పందించాల్సి ఉంది. అయిన‌ప్ప‌టికీ బీసీసీఐ మాత్రం డ్రీమ్ 11నే ఈ సారికి టైటిల్ స్పాన్స‌ర్‌గా కొన‌సాగించే అవ‌కాశాలే ఉన్నాయి. లేదంటే ఆ సంస్థ‌కు భారీ ఎత్తున న‌ష్టం వ‌స్తుంది. అందుక‌ని బీసీసీఐ ఎదుట వేరే ప్ర‌త్యామ్నాయం ఇప్పుడు లేదు. కాగా కేవలం ఈ సీజ‌న్ ఐపీఎల్‌కు మాత్ర‌మే డ్రీమ్ 11 టైటిల్ స్పాన్సర్‌షిప్ హ‌క్కుల కింద బీసీసీఐకి రూ.222 కోట్లు చెల్లించ‌నుంది.

Read more RELATED
Recommended to you

Latest news