శృంగారం ఔషదం ఆర్ఎల్ఎఫ్-100తో క‌రోనాకు చెక్‌…!

-

ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా పేరు చెపితేనే కోట్లాది మంది ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. క‌రోనా ఈ పేరు చెపితేనే ఎవ‌రికి వారికి ఒళ్లు గ‌గుర్పొడుస్తోంది. ఈ వైర‌స్ మ‌హ‌మ్మారి ఆరేడు నెల‌లుగా ప్ర‌పంచం ఉరుకులు ప‌రుగుల‌కు ఎలా బ్రేకులు వేసిందో చూస్తూనే ఉన్నాం. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా 2 కోట్ల మందికి ద‌గ్గ‌ర్లో క‌రోనా బాధితులు ఉన్నారు. అన‌ధికారిక లెక్క‌లు కూడా క‌లుపుకుంటే క‌రోనా బాధితులు 2 కోట్ల పైమాటే. ఒక్క అమెరికాలోనే దీని భారీన ప‌డి ఏకంగా 1.5 ల‌క్ష‌ల మంది మృతి చెందారంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో క‌రోనా వ్యాక్సిన్ కోసం వంద‌లాది ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి.

ఇక ర‌ష్యా ఆగ‌స్టులో కరోనా వ్యాక్సిన్ ప్ర‌జ‌ల‌కు పంపిణీ చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఆక్స్‌ఫ‌ర్డ్ వ‌ర్సిటీ వ్యాక్సిన్ సైతం త్వ‌ర‌లోనే ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌స్తుంద‌ని చెపుతున్నారు. ఇక సెప్టెంబ‌ర్ – డిసెంబ‌ర్ మ‌ధ్య‌లో వ్యాక్సిన్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. అయితే ఈ ప‌రిశోధ‌న‌ల్లో శాస్త్ర‌వేత్త‌లు మ‌రో గుడ్ న్యూస్ చెప్ప‌డంతో కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించేలా ఉంది. అంగ‌స్తంభ‌న స‌మ‌స్య కోసం వాడే ఆర్ఎల్ఎఫ్-100 కరోనాను నివారిస్తోందనే విషయం ప్రాధ‌మిక ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డ‌వుతోంద‌ట‌.

సెప్టెంబ‌ర్ 1వ తేదీ త‌ర్వాత దీనిపై మ‌రిన్ని ప‌రిశోధ‌న‌లు చేయ‌నున్నార‌ట‌. వాస్త‌వంగా ఆర్ఎల్‌ఎఫ్-100ను అంగస్తంభన సమస్యల నివారణ కోసం వాడుతుంటారు. దీనినే అవిస్డిల్ అని కూడా పిలుస్తారు. దీనిని ముక్కు ద్వారా పీల్చ‌డం ద్వారా అంగ‌స్తంభ‌న స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయి. అయితే ఇప్పుడు ఇదే మందుతో క‌రోనా వైర‌స్ బాధితుల‌పై సైతం ప‌రీక్ష‌లు చేసేందుకు వాడుతున్నామ‌ని అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ చెపుతోంది.

ఈ మందును ఇప్ప‌టికే ఓ వ్య‌క్తిపై ప‌రిశోధించ‌గా పాజిటివ్ ఫ‌లితం రావ‌డంతో పాటు అత‌డు త్వ‌ర‌గా కోలుకున్నాడు. ఇప్పుడు ఇదే మందును ప‌లువురు క‌రోనా రోగుల‌పై ప‌రిశోధ‌న‌లు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. మ‌రి ఈ ఫ‌లితాలు కూడా అనుకూలంగా వ‌స్తే ఆర్ఎల్ఎఫ్-100 క‌రోనాకు మంచి ఔష‌ధం కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version