తాగేసి ఫ్లైట్లో పాడు పని.. ఏకంగా ఇరవై ఏళ్ళ జైలు శిక్ష !

-

కరోనా వైరస్ ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చివేసింది. అయితే ఈ మహమ్మారిని మాత్రం కొంతమంది సీరియస్ గా తీసుకోవడం లేదు. అలాంటి ఒక సందర్భంలో, కొలరాడోకు చెందిన వ్యక్తి ఫేస్ మాస్క్ ధరించడానికి నిరాకరించడమే కాక, అలస్కా ఎయిర్‌లైన్స్ విమాన సీటుపై నిలబడి మూత్ర విసర్జన చేశారు. దీంతో అతనికి ఇరవై ఏళ్ళ జైలు శిక్ష విదించారు. డెన్వర్‌లోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం, మార్చి 9 న విమానం ల్యాండ్ అయిన తర్వాత ఎఫ్‌బిఐ 24 ఏళ్ల లాండన్ గ్రియర్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. విమానం ఎక్కాక గ్రియర్ నిద్రించడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించాడని అతనిని మాస్క్ ధరించమని పదేపదే అడిగినా అటెండర్ చేసిన అభ్యర్థనలను విస్మరించాడని అఫిడవిట్ పేర్కొంది.

కొద్ది నిమిషాల తర్వాత, అతను తన సీటు ఎక్కి మూత్ర విసర్జన చేయడం ప్రారంభించినప్పుడు షాక్ అయిన ప్రయాణికులు ఫ్లైట్ అటెండెంట్లను పిలిచారు. ఫ్లైట్ అటెండెంట్లలో ఒకరు గ్రియర్ కావాలనే ఇలా చేస్తున్నట్లు గమనించాడు, కానీ అతను తనను తాను కప్పిపుచ్చుకోవాదానికి ఏమీ తెలియనట్లు నేను మూత్ర విసర్జన చేయాలి”. అని పేర్కొన్నాడు. ఇక అతనిని అరెస్టు చేసిన తరువాత, ఎఫ్బిఐ ఏజెంట్లతో మాట్లాడుతూ, నాలుగు బీర్లను, అలాగే సీటెల్ నుండి డెన్వర్ కి తన కనెక్ట్ విమానం ఎక్కే ముందు కొన్ని షాట్లు కూడా తాగాడని ఒప్పుకున్నాడు. దీంతో అతనికి ఇరవై ఏళ్ళ శిక్ష పడింది. 

 

Read more RELATED
Recommended to you

Latest news