దృశ్యం -2 టీజర్‌ రిలీజ్..అదరగొట్టిన వెంకీ మామ

విక్టరీ వెంకటేష్‌ హీరోగా నటిస్తున్న తాజా థ్రిల్లర్‌ మూవీ దృశ్యం 2. ఇప్పటికే దృశ్యం సినిమా మంచి విజయం అందుకున్న వెంకీ మామ… దాని సీక్వెల్‌ గా దృశ్యం 2 ను తెరకెక్కిస్తున్నాడు. వెంకటేష్‌ హీరోగా, మీనా హృరోయిన్‌ ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాకు అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తుండగా… సతీష్‌ కురుప్‌ సినిమాటోగ్రపీ నిర్వహిస్తున్నారు.

దృశ్యం లో కనివిందు చేసిన… నటీ నటులే దృశ్యం 2 లోనూ కనిపిస్తున్నారు. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి ఓ బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా టీజర్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. వరుణ్‌ కేసు గురించి అందరూ మాట్లాడుకోకవడంతో టీజర్‌ ప్రారంభం అవుతుంది. గత 6 ఏళ్లు గా సాధారణ జీవితం గడుపుతున్న ఆ కుటుంబం మళ్లీ పాత జ్ఞాపకాల్లోకి వెళ్లి పోయింది. ఆ ఘటన నుంచి బయటపడేందుకు వెంకీ మరో ప్లాన్‌తో వచ్చాడని ఈ టీజర్‌ చూస్తే మనకు తెలుస్తోంది. మొత్తానికి ఈ టీజర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.