14న కేబినేట్ భేటీ.. నోటిఫికేషన్లు, ఉద్యోగులకు డీఏపై నిర్ణయం?

-

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఈ నెల 14న సమావేశం కానున్నది. సీఎం కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. దాదాపు 70వేల పోస్టులకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేయనున్నట్లు సమాచారం. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగులకు డీఏపై ఓకే చెప్పనున్నట్లు తెలుస్తున్నది. ఏక కాలంలో రెండు డీఏలను ప్రకటించే అవకాశం ఉన్నది.

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ నిలిచిపోయి చాలా కాలమైంది. నోటిఫకేషన్లు రాకపోవడంతో నిరాశతో నిరుద్యోగులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు కూడా గట్టిగానే స్పందిస్తున్నాయి. వెంటనే ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండు చేస్తున్నాయి. ప్రతి మంగళవారం ఉద్యోగాల భర్తీ వైఎస్సార్ టీపీ పార్టీ నేత షర్మళ దీక్ష చేస్తుండగా, కాంగ్రెస్ నిరుద్యోగ జంగ్ సైరన్ పేరిట ఉద్యమాలు చేస్తున్నాయి. బీజేపీ 16న ట్యాంక్ బండ్‌పై నిరుద్యోగ మిలియన్ మార్చ్‌కు పిలుపునిచ్చింది. రోజురోజుకూ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుండటంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అలర్ట్ అయినట్లు కనిపిస్తున్నది. ఇప్పటికే 70 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం నిర్వహించే కేబినెట్ సమావేశంలో ఖాళీల భర్తీకి ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలుస్తున్నది.

సీఎస్ సోమేశ్వర్‌కుమార్‌తో గురువారం టీజీఓ, టీఎన్‌జీఓ నేతలు సమావేశమైన విషయం తెలిసిందే. పెండింగ్‌లో ఉన్న డీఏలను క్లియర్ చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో జరిగే కేబినెట్ భేటీలో ఉద్యోగులకు డీఏపై కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఒకేసారి రెండు డీఏలకు ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలుస్తున్నది.

Read more RELATED
Recommended to you

Latest news