దుబ్బాక ఎన్నిక… కేసీఆర్ లో వచ్చిన చిన్న చేంజ్…!

దుబ్బాక ఉప ఎన్నికల ఓటమి, తెరాస పార్టీ నేతలకు బిజెపిలోకి ఆహ్వానం పలకడం… ఇవి అన్నీ కూడా ఇప్పుడు రాజకీయంగా తెరాస పార్టీని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీనితో సిఎం కేసీఆర్ అప్రమత్తమయ్యారు. పార్టీ నేతలలో అసహనంగా ఉన్న వారి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారే అవకాశం ఉంది అనే ప్రచారం జరిగింది.

ఈ నేపధ్యంలో నేడు ఖమ్మం, వైరా, మధిర నియోజకవర్గాల్లో మంత్రులు పర్యటిస్తున్నారు. రైతు వేదిక ప్రారంభానికి మాజీ మంత్రి తుమ్మల వస్తున్నారు తుమ్మల చే రైతు వేదిక ప్రారంభానికి అధిష్టానం ఆహ్వానం పలికింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొంటారు. మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కూడా అధిష్టానం ఆహ్వానం పలికింది.