తెలంగాణలో మద్యం అమ్మకాలు మరోసారి రికార్డు స్థాయిలో నెలకొన్నాయి. దసరా పండుగ నేపథ్యంలో తెలంగాణలో మద్యం ఏరులై పాలింది. పండుగకు ముందు వరుసగా సెలవులు రావడంతో మద్యం అమ్మకాలు భారీగా పెరిగినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. గత 9 రోజుల్లో రూ.713.25 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు స్పష్టంచేశారు. రేపు దసరా కావడంతో ఈ మూడు రోజుల్లో సేల్స్ ఎక్కువగా జరుగుతాయని అంచనా వేస్తున్నారు.
వీకెండ్ కావడంతో మరింత మద్యం సేల్స్ పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దసరా నేపథ్యంలో షాపుల్లో మద్యం స్టాక్ అందుబాటులో ఉంచాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అందాయి.దసరాకు ప్రతిఏటా తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరుతాయని అందరికీ తెలిసిందే. అయితే, దసరాకు ముందు మద్యం ధరలు పెరుగుతాయని, ప్రభుత్వం ఈ మేరకు కసరత్తు చేస్తోందని ఊహగానాలు వినిపించినా ధరలు మాత్రం పెరగకపోవడంతో మందు బాబులు రిలాక్స్ అయ్యారు.