రాముడు, కృష్ణుడిపై వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి సంచలన పోస్ట్ పెట్టారు. చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేస్తూ… రాముడు, కృష్ణుడిపై వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి సంచలన పోస్ట్ పెట్టారు. బలగం/సైన్యం లేనిదే … “రాముడు” కూడా రావణుడిని చంపలేక పోయాడని తెలిపారు విజయసాయిరెడ్డి.
వ్యూహం/చాకచక్యం/కపటం లేనిదే … “కృష్ణుడు” కురుక్షేత్ర యుద్ధాన్ని ముగించలేక పోయాడని పేర్కొన్నారు. గెలిచిన ప్రతి యుద్ధం వెనక కొంత స్వార్థం, కొంత మోసం, కొంత కపటం కచ్చితంగా ఉంటుందని తెలిపారు.
గెలిచిన ప్రతివాడు గొప్పవాడు అవుతాడేమో… కానీ, మంచివాడు కాలేడు. అది చక్రవర్తులైనా … యోగి అయినా రిషి అయినా …. మనిషైనా… నువ్వయినా నేనైనా… ఇది సత్యం అని స్పష్టం చేశారు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి. కానీ స్వర్గీయ వైస్సార్ ఆయన మంచితనం వలన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి.