దానయ్య ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో అయినా పాల్గొంటారా.!

-

ఇప్పుడు దేశంలో నంబర్ వన్ దర్శకుడిగా మన రాజమౌళి ఎదిగిన సంగతి అందరికి తెలిసిందే. బహుబలి సినిమా లతో భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు తన తర్వాత సినిమా పై మనకంటే హాలీవుడ్ లో ఎక్కువుగా ఆసక్తి వుంది. RRR సినిమాకి కూడా ఇతర దేశాల లలో ఎక్కువ ప్రచారం అయ్యేలా చేస్తూ వస్తున్నాడు.

రీసెంట్ గా ఆర్ ఆర్ ఆర్  గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఫంక్షన్ లో  బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ‘నాటు నాటు’ సాంగ్   గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సాధించింన  సంగతి అందరికీ తెలిసిందే. దానితర్వాత ఆస్కార్ అవార్డుల రేసులో నాటునాటుసాంగ్ షార్ట్ లిస్ట్ కు ఎంపిక అయ్యింది. దీనితో దేశం మొత్తం ఆర్ ఆర్ ఆర్ టీమ్ కు అభినందనలు తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ ఆ పాటకు ప్రాణం పోసిన వారిని అందరిని పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ఆస్కార్ అవార్డుల కార్యక్రమం వచ్చే నెలలో జరగనుంది.

అంతా బాగానే ఉంది కానీ ఒక్కటి తగ్గింది పుష్ప అన్నట్టుగా అందరి పేర్లు వినిపిస్తున్నాయి కాని నిర్మాత నిర్మాత డీవీవీ దానయ్య పేరు మాత్రం వినిపించడం లేదు అలాగే ఆయన కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఇలా ఎందుకు అని సోషల్ మీడియాలో ఒకటే చర్చ నడుస్తోంది. కాని విషయం ఏమిటంటే ముందే రాజమౌళి అడిగినా ఈ హలీవుడ్ ప్రచారం కోసం దానయ్య డబ్భులు ఇవ్వను అన్నాడని, దీని వల్ల నాకు ఖర్చు తప్ప డబ్బులు రావని చేతులు ఎత్తేసారట. అందుకే ఈ ఖర్చు మొత్తం రాజమౌళి మరియు రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ లు సొంతంగా  పెట్టుకుంటున్నారని తెలుస్తోంది.ఇక ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో కూడా నిర్మాత పాల్గొంటారా లేదా అన్నది తెలియడం లేదు. ఆస్కార్ అవార్డు అనేది ఎంతో కష్టపడితే కూడా రానిది, దీనిని కూడా నిర్మాత లైట్ తీసుకుంటారా అనేది వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news