Eagle Movie : సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఈగల్‌’.. రవితేజ సంక్రాంతి బరి నుంచి త‌ప్పుకుంటున్నాడా.?

-

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఈగల్. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుండగా మరొక కీలకపాత్రలో కావ్య తాపర్ నటిస్తుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయడానికి మేకర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో రవితేజ అభిమానులు సినిమాకి సంబంధించిన అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈగ‌ల్ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ/ఏ (𝗨/𝗔) స‌ర్టిఫికెట్ ఇచ్చినట్లు చిత్ర బృందం వెల్లడించింది.

ఇదిలా ఉండగా… ఈ చిత్రం వాయిదా పడనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బాక్సాఫీస్ రేసులో మహేష్ బాబు నటిస్తున్నటువంటి గుంటూరు కారం, విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్, కింగ్ నాగార్జున నటిస్తున్న నా సామి రంగ తో పాటు తేజ సజ్జ హీరోగా నటిస్తున్న హనుమాన్ కూడా సంక్రాంతి బరిలో ఉన్నాయి. ఇప్పటికే చాలా థియేటర్లను ఈ సినిమాలే బుక్ చేసుకున్నాయి ఈ నేపథ్యంలో సంక్రాంతి బరి నుంచి రవితేజ తప్పుకోవడమే బెటర్ అని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news