రేపు జరగబోయే ఎంసెట్ రెండవ పేజ్ కౌన్సిలింగ్ ఆపమని జేఎన్టీయూకి హైకోర్టు అదేశాలు జారీ చేసింది. ఎందుకంటే కోవిడ్ కారణంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాయకుండానే విద్యార్థులను కనీస మార్కులు 35 తో పాస్ చేసేసింది ప్రభుత్వం. అయితే ఎంసెట్ నిబంధనల ప్రకారం ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలలో 45 శాతం ఖచ్చితంగా ఉండాలి. ప్రభుత్వం35 తో పాస్ చేసేసిన దాని వలన పెద్ద ఎత్తున విద్యార్థులు ఎంసెట్ అర్హత కోల్పోయారు.
ఈ విధంగా అర్హత కోల్పోయిన విద్యార్థులు ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. కోవిడ్ కారణంగా విద్యార్థులు పరీక్షలు రాయలేక పోయిన విషయం వాస్తవమేనని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ కూడా ఒప్పుకుని అదే విషయాన్ని హైకోర్టుకు తెలిపారు. అలానే ఒకటి రెండు రోజుల్లో ఎంసెట్ నిబంధనలు సవరిస్తూ ప్రభుత్వం GO జారీ చేస్తుందని కోర్ట్ కు తెలిపారు అడ్వకేట్ జనరల్. అడ్వకేట్ జరనల్ వాదనలు రికార్డు చేసిన హైకోర్టు రేపటి నుండి తలపెట్టిన ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రభుత్వ ఉత్తరువులు ఇచ్చేవరకు ఆపాలని జేఎన్టీయూకి అదేశాలు జారీ చేసింది.