బ్రేకింగ్ : తెలంగాణా సెక్రటేరియట్ నిర్మాణానికి టెండర్ ఖరారు

-

తెలంగాణ సచివాలయం నిర్మాణాన్ని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రేస్టీజీగా తీసుకుంది. ఆఘమేఘాల మీద పాత సెక్రటేరియట్ భవనాలను కూల్చి వేసిన ప్రభుత్వం ఆ స్థానంలో కొత్త సచివాలయ నిర్మాణానికి వడివడిగా అడుగులు వేస్తోంది. ఈరోజు తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణానికి మరో కీలక అడుగు పడింది. ఇప్పటికే ప్రభుత్వం 500 కోట్ల అంచనా వ్యయంతో సెక్రటేరియట్ నిర్మాణానికి టెండర్లు పిలిచింది ప్రభుత్వం.

తాజాగా ఈ కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి టెండర్ లు ఖరారు చేశారు. ఈ టెండర్ ని సనీకృత కొత్త సచివాలయం నిర్మాణానికి టెండర్లు ఖరారు చేసింది కమిషనర్ ఆఫ్ టెండర్స్. ఎల్ 1 గా షాపూర్జీ-పల్లొంజీ సంస్థ ఎంపికయింది. టెండర్లు ఖరారైన నేపథ్యంలో ప్రభుత్వం – షాపూర్జీ-పల్లొంజీ సంస్థల మధ్య అగ్రిమెంట్ కుదిరింది. 12 నెలల లోపు నిర్మాణం పనులు పూర్తి చేయాలనే నిబంధన పెట్టింది ప్రభుత్వం. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news