అండమాన్ దీవుల్లో భూకంపం.. !

-

అండమాన్ దీవుల్లో భూకంపం వచ్చింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.8 గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజి స్పష్టం చేసింది. అంతేకాకుండా రాత్రి 10:37 గంటల సమయంలో భూమి కంపించింది అని తెలిపింది.

నికోబార్ దీవిలోని క్యాంప్ బెలెబే నుండి 640 కిలోమీటర్ల దూరంలో లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ను గుర్తించినట్టు ఎస్ సీ ఎస్ వెల్లడించింది. గురువారం ఉదయం మొత్తం నాలుగు రాష్ట్రాల్లో భూమి కంపించింది. ఉత్తరప్రదేశ్ లోని మీరట్, జమ్మూకాశ్మీర్ లోని కత్రా, ఉత్తరాఖండ్ లోని గర్హ్వాల్ మరియు గుజరాత్ లోని జామ్ నగర్ లో భూకంపాలు వచ్చాయి. అయితే భూకంపం తీవ్రత తక్కువగా ఉండడంతో ఎలాంటి ప్రాణ మరియు ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news