ఈ మధ్య చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ ను తీసుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో ఇది బాగా ఉపయోగ పడింది. ఏదైనా అనారోగ్య సమస్య వస్తే హెల్త్ ఇన్సూరెన్స్ ను వినియోగించుకుని వైద్య చికిత్స చేయించుకోవచ్చు.
ఇది ఇలా ఉంటే కొంత మంది అన్ని అర్హతలు ఉన్నా హెల్త్ ఇన్సూరెన్స్ ను క్లెయిమ్ చేసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ చేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. భారీ మొత్తం లో ప్రీమియం చెల్లించినా క్లెయిమ్ ను తిరస్కరించడంతో కొంత మంది ఇబ్బంది పడ్డారు.
ప్రీమియం సరైన సమయానికి చెల్లించి క్లెయిమ్ ద్వారా డబ్బులు రాలేదు అంటే ఇవి గుర్తు పెట్టుకోవాలి. ప్రీమియం సరైన సమయానికి చెల్లించి క్లెయిమ్ ద్వారా డబ్బులు అయితే రిజెక్ట్ చేసారు. అలాంటప్పుడు ఏజెన్సీపై ఫిర్యాదు చేస్తే హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కు సంబంధించిన డబ్బులను మనం పొందొచ్చు.
అదే విధంగా ఏ బీమా అయినా 30 రోజులలో క్లెయిమ్ ను పరిష్కరించి డబ్బులివ్వాలి. అదే ఒకవేళ క్లెయిమ్ ను తిరస్కరిస్తే అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చెయ్యచ్చు. లోక్ పాల్ కేంద్రాల లో కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. దీని కోసం మీరు www.irdai.gov.in వెబ్ సైట్ ద్వారా పూర్తి వివరాలను చూడచ్చు. ఫిర్యాదు చేస్తే చికిత్స పత్రాల తో పాటు బిల్లులను జత చేయాలి.