శిథిలాల కింద మూడు రోజులు చిక్కుకున్న ఆ ఇద్దరు చిన్నారులు…!

ఓ ప్రాంతంలో 14 ఏళ్ల బాలిక.. మరో చోట 3 ఏళ్ల చిన్నారి.. ఎటు చూసినా చీకటే. ఊపిరి కూడా సరిగా అందని స్థితి. కదిలేందుకు కూడా వీలులేనంతగా శిథిలాల కింద చిక్కుబడిపోయారు. ఇలా.. గంటలు కాదు.. రోజులు గడిపారు. టర్కి, గ్రీస్‌ భూకంపంతో కూలిన అపార్ట్‌మెంట్ల శిథిలాల కింద ఆ ఇద్దరూ మూడు రోజుల పాటు ప్రాణాలతో గడిపారు. సహాయక చర్యలు చేపడుతున్న రెస్క్యూ టీమ్‌ గమనించి రక్షించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఆ ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు.

కాగా.. టర్కీలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఈ బృందాలు 106 మందిని శిథిలాల కింద నుంచి ప్రాణాలతో వెలికి తీశాయి. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృత దేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు 81 మృతి చెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.