సోనీ మ్యూజిక్ తో టిక్ టాక్ ఒప్పందం..

-

ఇండియాలో టిక్ టాక్ మంచి పేరు తెచ్చుకుంది. అయితే చైనా యాప్ కావడంతో దానిని ఇక్కడ నిషేదించారు. అయితే టిక్ టాక్ ఎక్కడా తగ్గకుండా తన ప్రయత్నాలు తాను చేస్తోంది. ప్రముఖ ఎంటర్ టైనింగ్ యాప్ టిక్‌ టాక్ ఈ ఉదయం సోనీ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ (ఎస్‌ఎంఇ) తో కొత్త లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం ఈ షార్ట్-ఫామ్ వీడియో యాప్ లో సోనీ మ్యూజిక్ యొక్క ఒరిజినల్ సాంగ్స్ ని క్రియేటర్స్ ఉపయోగించుకోవచ్చు.

 

ఈ అగ్రిమెంట్ తో సోనీ కళాకారులను ప్రోత్సహించే ప్రయత్నాలలో తమ రెండు కంపెనీలు కలిసి పని చేస్తున్నామని టిక్‌టాక్ తెలిపింది. అయితే ఈ ఒప్పంద నిబంధనలు ఏమిటి అనేవి ఏవీ బయటకు ప్రకటించలేదు. ఈ ఒప్పందం ద్వారా సోనీ మ్యూజిక్ యొక్క ప్రస్తుత హిట్స్, కొత్త రిలీజ్ లు, ఐకానిక్ క్లాసిక్స్ మరియు లాంటివి టిక్ టాక్ లో క్రియేటర్స్ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సోనీ యొక్క మ్యూజిక్ క్లిప్‌లను ప్రదర్శించడాని కంటే మించి వాటిని ప్రమోట్ చేసే ప్రయత్నాలలో ఈ రెండు కంపెనీలు కలిసి పనిచేయవచ్చని ఈ అగ్రిమెంట్ ద్వారా తేలింది.

Read more RELATED
Recommended to you

Latest news