ఫేస్‌బుక్‌ పోస్ట్ తో బంగ్లాదేశ్‌లో అల్లర్లు…!

ఒక ఫేస్‌బుక్‌ పోస్ట్‌.. బంగ్లాదేశ్‌లో అల్లర్లు రాజేసింది. ఫ్రాన్స్‌లో జరుగుతున్న పరిణామాలపై బంగ్లాలోని ఓ ఉపాధ్యాయుడితో పాటు పలువురు ఫేస్‌బుక్‌లో అనుకూల కామెంట్స్ పెట్టారు. దీంతో వారు ఒక వర్గాన్ని అవమానపరుస్తున్నారంటూ.. పెద్ద ఎత్తున వదంతులు వ్యాపించాయ్.

దీంతో.. కొమిల్లా, బ్రాహ్మిన్‌బర్హియా జిల్లాలతోపాటు పలు ఓ వర్గం ఇళ్లపై ఆందోళనకారులు విరుచుకుపడ్డారు. అయితే, అల్లర్లతో సంబంధం ఉన్న పలువురిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. కానీ, పెద్ద ఎత్తున ఆందోళనకారులు గుమిగూడుతూనే ఉన్నారు.