ఇలా ఈజీగా అకౌంట్ బ్యాలెన్స్ ని తెలుసుకోవచ్చు..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. ఈ సేవల వలన చాలా మందికి ప్రయోజనం కలుగుతోంది. అయితే సాధారణంగా మనం బ్యాంక్ కి వెళ్లి పని పూర్తి చేసుకోవాలి అంటే ఎక్కువ టైం పడుతుంది. క్షణాల్లో పూర్తి అయ్యే పనులు కూడా రద్దీ వలన టైం తీసుకుంటాయి. బ్యాంక్ బ్యాలెన్స్ మనం ఈజీగా తెలుసుకోవచ్చు.

బ్యాంకులు కూడా వినియోగదారుల స్మార్ట్‌ఫోన్‌ల సహాయంతో వారి ఖాతాలను వివరాలను ట్రాక్ చేసేందుకు టెక్నాలజీ ని ఉపయోగిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో మీకూ ఖాతా ఉందా…? అయితే మీరు మీ అకౌంట్ బ్యాలెన్స్ ని తెలుసుకోవాలంటే ఇలా సింపుల్ గా తెలుసుకోవచ్చు. బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్‌ను ట్రాక్ చేయడానికి కొన్ని ఈజీ పద్ధతులని తీసుకొచ్చింది. మరి అది ఎలానో ఇప్పుడు చూసేద్దాం.

ముందు మీ మొబైల్ నంబర్‌ ని మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయాలి. 92237 66666 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. బ్యాంక్ మెసేజ్ కోసం ఆగండి. బ్యాలెన్స్ వివరాలతో టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. మిస్డ్ కాల్స్ ద్వారా ఎస్‌బీఐ ఖాతా బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి బీఏఎల్ అని టైప్ చేసి 92237 66666 కు పంపాలి. బ్యాలెన్స్ మీకు ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది. అదే మీకు మినీ స్టేట్‌మెంట్ కావాలంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 9223866666 కు డయల్ చెయ్యండి. మీ ఖాతకు సంబంధించి లావాదేవీల వివరాలు వచ్చేస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news