కాకరకాయలో చేదుని ఇలా సులభంగా తొలగించచ్చు..!

-

కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ కాకర చేదు వల్ల చాలా మంది కాకరకాయను తినరు. కాకరకాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నాయి. అలాగే విటమిన్ సి, విటమిన్ ఈ, బి కాంప్లెక్స్, ఫైబర్, పొటాషియం, ఐరన్, కాల్షియం ఉంటాయి. అయితే కాకరకాయల్ని తీసుకుంటే ఎన్నో లాభాలను పొందవచ్చు. మరి చేదుగా ఉంటుంది కదా ఎలా తినొచ్చు అని మీరు అనుకోవచ్చు. కానీ ఇలా ఆ చేదుని తొలగించి తీసుకోండి.

కాకరకాయని ఉప్పుతో కడగండి:

కాకరకాయ వండుకోవడానికి ముందు మీరు కాకరకాయ ముక్కలు కట్ చేసుకుని అందులో ఉప్పు వేసి బాగా ఆ మిశ్రమాన్ని కలుపుతూ ఉండండి. 20 నుండి 30 నిమిషాల పాటు అలాగే వదిలేసి తర్వాత వండుకోండి. దీనితో చేదు తగ్గుతుంది.

గింజలు తొలగించండి:

కాకరకాయ గింజలు వల్ల చేదు ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు గింజలను తొలగించి అప్పుడు కూర ని వండండి.

కొద్దిగా ఉడికించడం:

ఉడికించి తర్వాత వండడం వల్ల కూడా అందులో ఉండే చేదు తొలగించొచ్చు. ఉడికించిన తరువాత కొద్దిగా సాల్ట్ వేసి ఆ తర్వాత ఆ కాకరకాయ ముక్కల్ని కడిగేసి వండుకుంటే టేస్ట్ బాగుంటుంది.

పెరుగులో వేసి కడగండి:

కాకరకాయను మీ వండుకోడానికి ముందు పెరుగులో వేసి ముక్కలు ని కడగండి ఆ తర్వాత వండుకుంటే చేదు తగ్గుతుంది.

డీప్ ఫ్రై చేయడం:

డీప్ ఫ్రై చేయడం వల్ల కూడా కాకరకాయ ఉండే చేదు తగ్గుతుంది. అలానే బెల్లం లేదా పంచదార వేసుకుని వండడం వల్ల కూడా ఇందులో ఉండే చేదు మనం తొలగించొచ్చు ఇలా ఈ విధంగా ఫాలో అయ్యి కాకరకాయలో చేదు తొలగించి కాకరకాయను తీసుకుని ఆరోగ్య ప్రయోజనాలను పొందచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news