BREAKING : రాజాసింగ్‌ కు ఈసీ బిగ్‌ షాక్‌..యూపీలో ప్రచారం చేయకూడదని ఆదేశాలు

-

గోషా మహల్ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఊహించని షాక్ తగిలింది. రాజా సింగ్ పై బ్యాన్ విధిస్తూ తాజాగా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు చేయాలని… తాజాగా ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రచారం చేయకుండా రాజాసింగ్ పై బ్యాన్ విధిస్తున్నట్లు ప్రకటించింది ఎన్నికల సంఘం.

ఎన్నికల పోలింగ్కు 72 గంటల ముందు ప్రచారం నిర్వహించొద్దని… ముఖ్యంగా ఇంటర్వ్యూలు కూడా ఇవ్వద్దని రాజాసింగ్ పై నిషేధం విధించింది ఎన్నికల సంఘం. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఎన్నికల సంఘం.

కాగా గత నాలుగు రోజుల క్రితం… యూపీ ఎన్నికల ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్. భారతీయ జనతా పార్టీ, సీఎం యోగికి ఓటు వేయకపోతే ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్లిపోవాల్సిందే నంటూ బహిరంగంగా వీడియోను విడుదల చేశారు. అయితే దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందడంతో… రాజా సింగ్ పై వేటు వేసింది కేంద్ర ఎన్నికల సంఘం.

Read more RELATED
Recommended to you

Exit mobile version