శాడిజంలో తగ్గదేది లేదంటున్న ‘కిమ్’… నార్త్ కొరియా ప్రజలకు మరో వింత శిక్ష

-

శాడిజంలో తగ్గేది లేదందున్న కిమ్ జోంగ్ ఉన్. తన వింత శిక్ష, క్రూరమైన శిక్షల గురించి ప్రపంచానికి తెలియనవి కావు. ఇటీవల తన తండ్రి సమాధి వద్ద మొక్కలు పూలు పూయకపోవడంతో ఇద్దరు తోటమాలిలకు జైలు శిక్ష విధించారు. గతంలో కూడా క్రూరమైన శిక్షలు విధించారు. గతంలో తన సొంత మామను అత్యంత క్రూరంగా చంపేశాడు. ఓ మీటింగ్ లో నిద్రపోతున్న అధికారికి కూడా మరణ శిక్ష విధించాడు. ప్రవాసంలో ఉన్న కిమ్ తమ్ముడిని కూడా కొరియా ఏజెంట్ల సాయంతో చంపేశాడు.

ఇదిలా ఉంటే .. తాజాగా మరోసారి కిమ్ తన శాడిజాన్ని ప్రదర్శించాడు. ఇటీవల తన తండ్రి కిమ్ జోంగ్-ఇల్ 80వ జయంతి వేడులను గడ్డకట్టే చలిలో నిర్వహించాడు. ఉత్తర నగరమైన సంజియోన్‌లో ఈ వేడుకలను నిర్వహించారు. ఆ సమయంలో అక్కడ ఉష్ణోగ్రతలు 5°F (-15°C) నమోదయ్యాయి. అయితే ఇదిలా ఉంటే… గడ్డ కట్టే చలిలో ప్రజలు ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా పాల్గొనాటంటూ.. ఆర్డర్ వేశాడు. తీవ్రమైన చలిలో చేతులకు గ్లౌజులు, టోపీలు లేకుండా హాజరుకావాలని హుకుం జారీ చేశారు. తన ప్రసంగం అయ్యే వరకు ప్రజలు అలాగే ఉండాలని ఆదేశించాడు. ఇదిలా ఉంటే కిమ్ మాత్రం తను ప్రసగించే సమయంలో పక్కనే హీటర్లు పెట్టుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version