ఎట్టకేలకు తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త వినిపించింది ఎన్నికల కమిషన్. నిజానికి సంక్రాంతికి పీఆర్సీ ప్రకటన చేస్తామని ప్రభుత్వం మాట ఇచ్చింది. క్యాలెండర్‌లో పేజీలు మారుతున్నాయి కానీ ఉద్యోగుల సమస్యలు మాత్రం తీరడం లేదు. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ పేరిట మరో అడ్డంకి వచ్చింది. అయితే ఈ విషయం మీద ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ని పర్మిషన్ కోరగా అందుకు ఎన్నికల కమిషన్ అనుమతిచ్చింది.
నిజానికి నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఉపఎన్నిక నేపథ్యంలో పీఆర్సీ ప్రకటనకు అనుమతి కోరుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. దీనిపై ఈసీ స్పందిస్తూ వేతన సవరణ ప్రకటనకు ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొంది. అయితే పీఆర్సీ ప్రకటన ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించరాదు అని తన అనుమతి పత్రంలో పేర్కొంది.