తిరుపతి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం గురించి పక్కన పెడితే ఆ పార్టీ ఎంతవరకు ప్రభావం చూపిస్తోందనే దానిపైన ఆ పార్టీ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ విషయంలో ప్రజల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం ఉంది. కాబట్టి ఆ పార్టీ చాలా వరకు జాగ్రత్తగా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న సోము వీర్రాజు కొన్ని కొన్ని అంశాలలో తీవ్రంగా విఫలమవుతున్నారు.
ఇప్పటివరకు కూడా పార్టీలో ఆయన ఎటువంటి మార్పులు కూడా చెప్పుకోదగ్గ విధంగా చేసిన పరిస్థితి లేదు. తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయడం లేదు. కాబట్టి ఆ పార్టీ నేతల్లో తీవ్ర అసహనం ఉంటుంది. కాబట్టి ఆ పార్టీ నేతలతో బీజేపీ నేతలు ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ పార్టీని ముందుకు తీసుకుని వెళ్లే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రచారం విషయంలో జనసేన పార్టీ చాలా కీలకం అవుతుంది.
జనసేన పార్టీ కార్యకర్తలు చేసే ప్రచారం పైన బిజెపికి ఓట్లు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సోము వీర్రాజు వాళ్లతో ఎక్కువగా మాట్లాడాలి. కానీ ఆయన తిరుపతి పర్యటనకు టూరిస్ట్ లాగా వెళ్లి వస్తున్నారు అని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. దీంతో జనసేన పార్టీ కార్యకర్తలలో కూడా ఆయనపై తీవ్రస్థాయిలో అసహనం ఉంది అంటూ కొంతమంది మండిపడుతున్నారు.