రాష్ట్రంలో మరో వారం రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలని ఆదేశించింది. ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల పేర్లతో రేపు ఉదయం 11 గంటలలోపు జాబితా పంపాలని సీఎస్ జవహర్రెడ్డికి సూచించింది. రాజేంద్రనాథ్ రెడ్డికి ఎన్నికల విధులు అప్పగించకూడదని పేర్కొంది. డీజీపీని బదిలీ చేయాలని కొన్ని రోజులుగా కూటమి నేతలు చేస్తోన్న ఫిర్యాదులకు ఈసీ స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే, కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి 2018 నుంచి 2019 వరకు డ్రగ్ కంట్రోల్ డీజీగా బాధ్యతలు నిర్వహించారు. 2019 నుంచి 2020 వరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా పని చేశారు. ఆ తర్వాత 2020, ఫిబ్రవరి 19న ఏపీ డీజీపీగా నియమితులయ్యారు.