ఏపీ సీఎం జగన్ కి ఈడీ కోర్టు సమన్లు !

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని జగన్ కు ఈడీ కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్ ఇటీవల నాంపల్లి కోర్టు నుంచి ఈడీ కోర్టుకు బదిలీ అయిన సంగతి తెలిసిందే. అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్ ను విచారణకు స్వీకరించిన ఈడీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

విజయసాయి రెడ్డి,  హెటిరో  డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి, అరబిందో ఎండీ నిత్యానంద రెడ్డి, పీవీ రాంప్రసాద్ రెడ్డి, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, విశ్రాంత ఐఏఎస్ బీపీ ఆచార్యకు కూడా ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే నిజానికి ఆయన సీఎం కాబట్టి ఇలా విచారణకు హాజరు కాలేనని దాదాపుగా అన్ని కేసుల విచారణకి హాజరు కావడం లేదు. మరి ఈ కేసు విచారణకు హాజరు అవుతారా ? లేదా అనేది తెలియాల్సి ఉంది.