కాసేపట్లో పార్టీ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూలుపై చర్చించనున్నట్టు చెబుతున్నారు. ఎన్నికల నిర్వహణను గతంలోనే టీడీపీ స్వాగతించినట్టు సమాచారం. అధినేతతో సమావేశం తర్వాత ఎన్నికల అంశంపై స్పందించనున్నారు టీడీపీ నేతలు. నిజానికి ఈ ఎన్నికలు టీడీపీ లబ్ది కోసమే పెట్టాలని చూస్తున్నారని వైసీపీ ఆరోపణలు చేస్తోంది.
మరో పక్క ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్ పై హౌస్ మోషన్ కు ఏపీ ప్రభుత్వం సిద్ధమయింది. ఇప్పటికే న్యాయ పరమైన పత్రాలను సిద్ధం చేసిన ప్రభుత్వ న్యాయ నిపుణులు ఎన్నికల నిర్వహణను కరోనా వ్యాక్సిన్ పంపిణీ కారణంగా నిర్వహించలేమని పిటిషన్ లో ఏపీ ప్రభుత్వం పేర్కొంటోంది. హైకోర్టుకి నేటి నుంచి సెలవులు కావటంతో హౌస్ మోషన్ పిటిషన్ వేస్తున్నారు. నేరుగా న్యాయమూర్తి ఇంటికి వెళ్లి హౌస్ మోషన్ పిటిషన్ వేస్తామని చెబుతున్నారు ప్రభుత్వ న్యాయవాదులు.