దిల్లీ లిక్కర్ స్కామ్ లో దూకుడు పెంచిన ఈడీ

-

దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే ప్రముఖ వ్యాపారి వెన్నమనేని శ్రీనివాసరావును రెండు రోజులుగా తమ కార్యాలయానికి పిలిపించి దాదాపు ఏడు గంటలపాటు విచారించారు. తాజాగా మరో వ్యక్తి.. పెన్నాక శరత్ చంద్రా రెడ్డి పేరు తెర పైకి రావడంతో అతడిని కూడా విచారిస్తున్నారు. దిల్లీ మద్యం సరఫరా కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడైన ప్రాథమిక సమాచారం ఆధారంగా ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

దిల్లీలోని మద్యం కుంభకోణంతో ఈ సాఫ్ట్​వేర్ కంపెనీలకు సంబంధం ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీల్లో లావాదేవీలు లేకున్నా కోట్లలో లాభాలు వస్తున్నట్లు చూపించిన యజమానులు…. డబ్బును హవాలా మార్గంలో ఇతర పనులకు ఉపయోగించినట్లు గుర్తించారు. డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి హవాలా మార్గంలో డబ్బులు దిల్లీకి తరలించినట్లు అనుమానిస్తున్నారు. కరీంనగర్​కు చెందిన శ్రీనివాసరావు ఇసుక, మైనింగ్, స్థిరాస్తి వ్యాపారంతో పాటు పలు కంపెనీల్లోనూ డైరెక్టర్‌గా ఉన్నట్లు గుర్తించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news