RRR ‘ఆస్కార్’కు నామినేట్ అయ్యుంటే… అంత ఖర్చు అయ్యేదా?

-

ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందిన తెలుగు చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ పాన్‌ ఇండియా సినిమా ఈ ఏడాది మార్చిలో విడుదలై, ఘన విజయం అందుకుంది. ఓటీటీల్లోనూ రికార్డు స్థాయి వీక్షణలు సొంతం చేసుకుంది. ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉంది.

- Advertisement -

గత కొన్ని రోజులుగా ఆస్కార్ కు నామినేట్ అవుతుంది అంటూ.. ప్రచారం సాగింది. చివరకు నిరాశ ఎదురైంది. భారత్ తరపున గుజరాతీ చిత్రం చెల్లె షో చిత్రం నామినేట్ అయ్యింది. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ కు వెళ్లి ఉంటే భారీగా ఖర్చు చేయాల్సి వచ్చేది అట. ఆస్కార్ అవార్డుల్లో ఇప్పటి వరకు భారతీయ సినిమాలు వెలుగులు విరజిమ్మలేదు. బ్రిటిష్ కాలాబోరేషన్స్ లో వచ్చిన ‘గాంధీ’, ‘స్లం డాగ్ మిలియనీర్’ చిత్రాలు ఆస్కార్ వరకు వెళ్లగలిగాయి.

ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ కు నామినేట్ అయినట్లయితే క్యాంపైన్ (ప్రింట్ అండ్ అడ్వర్టైజింగ్) కోసం నిర్మాత డివివి దానయ్య చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఏదైనా మూవీ ఆస్కార్ కు నామినేట్ అయితే దాని కోసం ప్రత్యేకంగా పబ్లిసిటీ కాంపెయిన్ చేయాల్సి ఉంటుంది. అక్కడి ఆడియన్స్, ఫిల్మ్ మేకర్స్ కు స్పెషల్ షో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

గతంలో కూడా అత్యధిక ఆస్కార్ అవార్డులు అందుకున్న “పారాసైట్” సినిమా ఆస్కార్ క్యాంపెయిన్ కోసం దాదాపుగా 40 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందట. ఓవరాల్ గా 17నుంచి 18 మిలియన్ డాలర్స్ అంటే 120 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఆస్కార్ కి సెలెక్ట్ అయిన తర్వాత నామినేట్ అవ్వడం కోసం సినిమా బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుందని కొంతమంది నిర్మాతలు అంటున్నారు. “విశారనై” ప్రొడ్యూసర్ అయిన ధనుష్ ఖర్చుకు వెనకాడకుండా ప్రమోషన్స్ చేసాడు. కానీ ఆ మూవీ మాత్రం ఆస్కార్ కు నామినేట్ కాలేకపోయింది.

ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ గనుక ఆస్కార్ కు నామినేట్ అయితే నిర్మాతలు తక్కువలో తక్కువ 30 నుంచి 50 కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఆస్కార్ అవార్డు వచ్చినట్లయితే మాత్రం సినిమా వరల్డ్ ఆడియన్స్ కు రీచ్ అవుతుంది. అందుకే రాజమౌళి ఖర్చుకు వెనకాడకుండా ప్రయత్నాలు చేస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని హాలీవుడ్‌ ప్రముఖ దర్శకులూ ప్రశంసించిన సంగతి తెలిసిందే. దర్శకత్వం, విజువల్స్‌, సంగీతం, యాక్షన్‌.. ఇలా అన్ని కోణాల్లోనూ ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచింది. బాక్సాఫీసు వద్ద రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఆస్కార్‌ 2023 రేసులో (బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో ) నిలుస్తుందని చాలా మంది భావించారు. కానీ, ఆ అవకాశం దక్కలేదు. ‘ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా’.. భారత్‌ తరఫున ‘ఛెల్లో షో’ అనే గుజరాతీ చిత్రాన్ని నామినేట్‌ చేసింది. దాంతో, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను యూఎస్‌లో పంపిణీ చేసిన వేరియన్స్‌ ఫిల్మ్స్‌ సంస్థ ఆ చిత్రాన్ని పరిశీలించాలని అకాడమీని కోరింది. అన్ని కేటగిరీలకు సంబంధించి ఓటింగ్‌ నిర్వహించేలా ప్రణాళికలు రచిస్తోంది. రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టును మహేశ్‌బాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే. సరికొత్త యాక్షన్‌ అడ్వెంజర్‌గా ఆ సినిమా రూపొందనుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...