మలయాళ నటుడు పృథ్వీరాజ్‌కు ఈడీ నోటీసులు

-

మలయాళ చిత్రం L2-ఎంపురాన్‌ సినిమాను అనేక వివాదాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రబృందం ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు దాడి చేశారు. ఈ చిత్ర నిర్మాత గోకులం గోపాలన్‌ ఇంట్లో తనిఖీలు చేసి కోటిన్నర రూపాయలు సీజ్ చేశారు. మరోవైపు ఎంపురాన్‌ సినిమా డైరెక్టర్‌, నటుడు పృథ్వీరాజ్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది.

శ్రీగోపాలన్‌ చిట్‌ అండ్‌ ఫైనాన్స్‌లో ఆర్థిక అవకతవలు జరిగాయన్న ఆరోపణలపై ఎంపురాన్‌ నిర్మాతపై- ఫెమా చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు కేరళ, తమిళనాడులోని గోపాలన్‌ ఆస్తుల వద్ద రెండు రోజులు తనిఖీలు నిర్వహించి కోటిన్నర నగదు సీజ్ చేశారు. మరోవైపు ఎల్‌2: ఎంపురాన్‌ సినిమాను తెరకెక్కించడం వల్ల కేంద్ర సర్కార్.. గోపాలన్‌పై అక్రమ కేసులు పెట్టి కేంద్రం వేధిస్తోందని కేరళలో అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్‌తో పాటు యూడీఎఫ్‌ ఆరోపించాయి. కేరళ సాంస్కృతిక రంగం, కళాత్మక స్వేచ్ఛతో పాటు భావ ప్రకటన స్వేచ్ఛపై బీజేపీ దాడి చేస్తోందని దుయ్యబట్టాయి.

Read more RELATED
Recommended to you

Latest news