సుకేశ్ గుప్తా కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో ఈడీ పిటిషన్

-

ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జువెల్లర్స్ డైరెక్టర్ సుకేశ్ గుప్తా కస్టడీ కోరుతూ ఈడీ అధికారులు ఇవాళ నాంపల్లి కోర్టులో పిటషన్ దాఖలు చేశారు. సుకేశ్ గుప్తాను వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఎంఎంటీసీ నుంచి తీసుకున్న బంగారాన్ని విక్రయించగా వచ్చిన నగదును ఎక్కడికి మళ్లించారనే వివరాలు తెలుసుకోవాల్సి ఉందని ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. ఈ మోసంలో ఇంకెవరెవరి హస్తం ఉందనే కోణంలో దర్యాప్తు చేయాలని అందుకే సుకేశ్ గుప్తాను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిష​న్​లో పేర్కొన్నారు.

సుకేష్ గుప్తాను ఈడీ అధికారులు బుధవారం రోజున అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు రిమాండ్​కు తరలించారు. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేశారు. గతేడాది ఆగస్టులో ఎంబీఎస్ జ్యువెల్లర్స్​​కు చెందిన రూ.363కోట్ల ఆస్తులను సీజ్ చేసిన ఈడీ అధికారులు రెండు రోజుల క్రితం మరోసారి ముసద్దీలాల్ జువెల్లర్స్​లో సోదాలు చేసి రూ.150 కోట్ల విలువైన బంగారు వజ్రాభరణాలతో పాటు బినామీ ఆస్తులను సీజ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news