కార్వి కేసు : ఈడీ సంచలన నిర్ణయం

-

రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్వీ కేసు లో సంచలన రేపిన సంగతి తెలిసిందే. ఈ కార్వి కేస్ లో ఈడీ దూకుడు పెంచారు. 3000 కోట్ల రూపాయల ఫ్రాడ్ కేస్ లో ఈడి దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. సీసీ ఎస్ ఎఫ్ ఐ ఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ అధికారులు… ఇటీవల హైదరాబాద్, గుంటూరు లలో పార్థసారధి ఇల్లు, కార్యాలయాల పై దాడులు చేశారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ కార్వి హెడ్ ఆఫీస్ లో 10 గంటల పాటు సోదాలు నిర్వహించింది ఈడి.

అంతేకాదు.. కార్వీ సంస్థ షేర్ లను ఫ్రీజ్ చేయాలని ఈడీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కార్వీ ఎండీ పార్థసారధి , అతని కుమారులు రజట్ పార్థసారథి, అధిరజ్ పార్థసారధి లకు సంబంధించిన షేర్ లను ఫ్రీజ్ చేయనున్నారు అధికారులు. ఇక ఇప్పటి వరకు కార్వి కు సంబందించిన 700 కోట్ల రూపాయల షేర్ లను ఫ్రీజ్ చేసింది ఈడి. ఇక అటు ఈ కేసులో కార్వీ ఎంపీ పార్థ సారధి హై కోర్టు ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news