సీఎం కేసీఆర్ గొప్ప సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్ : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

టీఆర్‌ఎస్‌ సర్కార్‌ పై కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. ధరణి పోర్టల్, భూ సమస్యల పరిష్కార డిమాండ్ తో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి విపక్షాలు. ఈ సందర్బంగా కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ…. తెలంగాణ సీఎం కేసీఆర్ గొప్ప సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్ అని… చురకలు అంటించారు. తెలంగాణ రాష్ట్రం అన్నింట్ల ముందుందని చెప్పిన సీఎం కేసీఆర్‌… ఇప్పుడూ వరి వేస్తే ఉరి అంటున్నాడని నిప్పులు చెరిగారు..

తాను కూడా ఒక సాఫ్ట్‌ వేర్‌ డెవలపర్ నేనని.. ఫస్ట్ సాఫ్ట్‌ వేర్‌ రెడీ చేసే ముందు సాధ్యాసాధ్యాలపై టెస్ట్ లు చేయాలని తెలిపారు. సాధ్యా సాధ్యాల పై కేసీఆర్ గారితో మాట్లాడాలంటే అధికారులకు భయమన్నారు. అందుకే తెలంగాణ పరిస్థితి ఇలా తయారైందన్నారు. అసలు ఇదొక సాఫ్ట్‌ వేర్‌ కాదని… ఇదొక కుట్ర అని మండి పడ్డారు.. ఎక్కడికి పోయిన ధరణి సమస్యనేనని…. భూములు ఇచ్చి గుంజుకున్నారని నిప్పులు చెరిగారు.. అందరి లాగే తనకు ధరణి సమస్య ఉందని… పోర్టల్ లో లోపం ఉంటే.. సర్వర్ డౌన్ అని అంటారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ వాళ్ళ పని అయితే అవుతుందని… ప్రజలది మాత్రం అస్సలు ముందుకు సాగదని ఫైర్‌ అయ్యారు.