TS ED.CET-2022 : ఎడ్ సెట్ షెడ్యూల్ విడుదల… ఈ నెల 7 నుంచే దరఖాస్తులు

-

ఎడ్ సెట్ షెడ్యూల్ ను తెలంగాణ రాష్ట్ర ఉన్న‌త విద్యా శాఖ విడుద‌ల చేసింది. జులై నెల‌లో 26, 27 తేదీల్లో ఎడ్ సెట్ ఎంట్రెన్స్ ప‌రీక్ష ఉండ‌నుంద‌ని రాష్ట్ర ఉన్న‌త విద్యా శాఖ క‌న్వీన‌ర్ తెలిపారు. అందు కోసం ఈ నెల 7 వ తేదీ నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వ‌నిస్తున్న‌ట్టు తెలిపారు. జూన్ 15 వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఎలాంటి ఆల‌స్య రుసం లేకుండా స్వీక‌రిస్తామ‌ని ప్ర‌క‌టించారు. 500 ఆల‌స్య రుసం తో జులై 15 వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌డానికి అవ‌కాశం క‌ల్పించిన‌ట్టు తెలిపారు.

ఎడ్ సెట్ ఎంట్రెన్స్ ప‌రీక్ష కోసం ద‌ర‌ఖాస్తు దారులు రూ. 600 చెల్లించాల్సి ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. అయితే ఎస్సీ, ఎస్టీలు మాత్రం ద‌ర‌ఖాస్తుల‌కు రూ. 450 చెల్లించాలని వివ‌రించారు. జులై 26, 27 తేదీల్లో ఎంట్రెన్స్ ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. మొత్తం 19 రీజిన‌ల్ సెంట‌ర్లు, 55 ప‌రీక్ష కేంద్రాల‌తో ఎడ్ సెట్ ఎంట్రెన్స్ ను నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపారు. డిగ్రీ , ఇంజనీరింగ్ లో 50 శాతం మార్క్స్ తో పాస్ అయిన వారు దరఖాస్తు కి అర్హులని ప్ర‌క‌టించారు. ఎస్సి ఎస్టీ బీసీ ద‌ర‌ఖాస్తు దారుల‌కు 40 శాతం మార్కులు వ‌చ్చిన వారు అర్హులు అని వివ‌రించారు.

Read more RELATED
Recommended to you

Latest news